News August 18, 2025
ప్రకాశం: గిరిజన బాలికపై దాడిచేసిన చిరుత ఇదేనా?

ఈనెల 14న దోర్నాల (M)చిన్నారుట్ల గూడెంలో చిన్నారి అంజమ్మపై చిరుతపులి దాడి చేసిన ఘటన తెలిసిందే. నల్లమల అరణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన ఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. చిరుత కదలికలపై దృష్టి సారించేందుకు కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేయగా తాజాగా ఓ కెమెరాకు గూడెం పరిసరాల్లో తరచుగా సంచరిస్తున్న చిరుతపులి చిక్కింది. ఇది చిన్నారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News August 19, 2025
దివ్యాంగ విద్యార్థులకు DEO సూచన

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.
News August 19, 2025
ప్రకాశం: 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు 214 అర్జీలు

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తరచూ 1100 టోల్ ఫ్రీ నంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు 214 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి రాలేనివారు, ఈ నంబర్‌కు తమ సమస్యను తెలిపితే వారి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
News August 19, 2025
ప్రకాశం SP మీకోసంకు 64 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.