News August 18, 2025
‘మార్వాడీ గో బ్యాక్’: ఆమనగల్లు బంద్‌పై ఉత్కంఠ

ఆమనగల్లు బంద్ చర్చనీయాంశమైంది. మార్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు ‘గో బ్యాక్’ నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అనగా, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్థానిక వ్యాపారుల మద్దతుదారులు తేల్చి చెప్పగా.. బంద్ ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News August 19, 2025
నరసాపురం: సైలింగ్ బోటింగ్‌కు వంద మంది క్యాడెట్లు

వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి 10వ వరకు ఒరిస్సాలోని చిలుక నేవల్ బేస్‌లో నరసాపురం ఆంధ్రా యూనిట్ ఆధ్వర్యంలో సైలింగ్ బోటింగ్ సాహస యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది క్యాడెట్లు పాల్గొనన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను యూనిట్ కమాండర్ సంజిత్ రౌత్రే, డిప్యూటీ క్యాంపు కమాండర్ అనిల్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు.
News August 19, 2025
16,347 ఉద్యోగాలు.. అభ్యర్థులకు బిగ్ అలర్ట్

AP: మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల మెరిట్ లిస్టు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్ మార్కులపై అభ్యంతరాల స్వీకరణ, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన లిస్టు రావడంతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
News August 19, 2025
శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు

జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా నిరుద్యోగులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు.