News August 18, 2025

అవినీతిపై ప్రశ్నించినందుకే నాపై ఆరోపణలు: MLA కూన

image

AP: శ్రీకాకుళం(D) పొందూరు KGBV ప్రిన్సిపల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆముదాలవలస TDP MLA కూన రవికుమార్ అన్నారు. ‘KGBVలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే ప్రిన్సిపల్ <>YCP<<>> నేతలతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తోంది. “తల్లికి వందనం”పై ముగ్గురు ప్రిన్సిపల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను. కేవలం పొందూరు ప్రిన్సిపల్‌తోనే వీడియో కాల్ తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు’ అని తెలిపారు.

Similar News

News August 20, 2025

జోకర్‌‌ను ఎన్నుకుంటే పాలన సర్కసే: KTR

image

TG: విద్యుత్ స్తంభాలపై ఉండే ఇంటర్నెట్ <<17454341>>కేబుల్స్<<>>ను విద్యుత్ అధికారులు తొలగించడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలకు దిగారు. ‘వినియోగదారులకు సమాచారమివ్వకుండా కేబుల్స్‌ను కట్ చేశారు. లక్షల మంది ఇంటర్నెట్ యూజర్లు ప్రభావితమయ్యారు. WFHకు ఆటంకం కలిగి రోజువారీ జీవితం గందరగోళంలో పడింది. సోషల్ మీడియా బాధితుల ఆవేదనతో నిండిపోయింది. కేబుల్స్‌తో సమస్య ఉంటే పద్ధతి ప్రకారం వెళ్లాలి’ అని ఫైరయ్యారు.

News August 20, 2025

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్రం పోయడంతో..

image

TG: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఇది. సూర్యాపేటలో చక్రధర్(50) అనే వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మూత్ర విసర్జన చేయడంతో చనిపోయాడు. వర్షంతో ట్రాన్స్‌ఫార్మర్ ఉన్న ప్రాంతమంతా అప్పటికే తడిగా మారింది. దీంతో మూత్రం పోయగానే చక్రధర్‌కు షాక్ కొట్టి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చూడగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
BE ALERT

News August 20, 2025

మెగా డీఎస్సీ.. ఎంపికైన అభ్యర్థులకే సమాచారం!

image

APలో 16,347 DSC పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని విద్యాశాఖ సమాచారం పంపింది. ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపింది. అటు ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించనుంది. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. SEP 5లోగా కొత్త టీచర్లకు పోస్టింగ్స్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.