News April 1, 2024

ఖమ్మం రీజియన్‌కి మరో 195 బస్సులకు ప్రతిపాదనలు

image

మహాలక్ష్మి స్కీం సందర్భంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ మేరకు ఖమ్మం రీజియన్‌లో అదనంగా 195 బస్సులు, 1000 మంది సిబ్బంది అవసరముందని.. ఇందుకోసం యాజమాన్యానికి ప్రతిపాదనలను పంపించామని రీజినల్ మేనేజర్ వెంకన్న అన్నారు. ఇటీవల రీజియన్‌కు 20 ఏసీ, నాన్‌ ఏసీ బస్సులు వచ్చాయి. వీటిని వివిధ డిపోలకు కేటాయించి అవసరమైన రూట్లలో తిప్పుతున్నామని చెప్పారు.

Similar News

News March 15, 2026

ఖమ్మంలో వర్షాల హెచ్చరిక.. రైతులకు జాగ్రత్తలు

image

నేటి నుంచి 20 వరకు ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి నరసింహారావు తెలిపారు. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు సంభవించే పరిస్థితులు ఉన్నాయన్నారు. మార్చి 18, 19 తేదీల్లో తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వెల్లడించారు. రైతులు పంటలను రక్షించుకునే చర్యలు తీసుకుని గాలులు, వడగళ్ల వానల వల్ల నష్టం కాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

News March 15, 2026

ప్రయాణికులకు శుభవార్త.. ప్రతి 45 నిమిషాలకో ఏసీ బస్సు

image

వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌, మియాపూర్‌కు ప్రతి 45 నిమిషాలకో ఏసీ రాజధాని నాన్‌స్టాప్‌ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ శివప్రసాద్‌ తెలిపారు. కొత్త బస్టాండ్‌ నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ల కోసం tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 14, 2026

గ్యాస్‌ బుకింగ్‌ పేరిట మోసాలు: సీపీ హెచ్చరిక

image

గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం హెచ్చరించారు. నకిలీ లింకులు, ఎస్ఎంఎస్ల ద్వారా కేవైసీ, ఓటీపీ వివరాలు కోరుతూ నగదు కాజేస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ను కేవలం అధికారిక యాప్‌ల ద్వారానే బుక్ చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.