News August 18, 2025

సుభాష్ చంద్రబోస్.. జననం తప్ప మరణం లేని యోధుడు!

image

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయవాద నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1897 JAN 23న ఒడిశాలో జన్మించారు. ‘నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అని యువతను ఉత్తేజపరిచి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి బ్రిటిషర్లకు చుక్కలు చూపించారు. 1945 ఆగస్టు 18న బోస్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినప్పటికీ ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

Similar News

News August 20, 2025

భారీగా పెరిగిన టమాటా ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పెరిగాయి. TGలోని HYD సహా జిల్లాల్లో నాణ్యమైన టమాటా కేజీ రూ.60-70 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌గా కేజీ రూ.40-50 వరకు ఉంది. అటు ఏపీలో విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో కేజీ రూ.50-60గా ఉండగా జిల్లాల్లో రూ.35-45 వరకు పలుకుతోంది. అతిభారీ వర్షాలు, వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News August 20, 2025

6వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు

image

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక USలో విదేశీ విద్యార్థులకు గడ్డుకాలం ఏర్పడింది. తమ దేశ చట్టాలను మీరితే విద్యార్థుల వీసాలు రద్దు చేస్తామన్న అగ్రరాజ్యం అన్నంత పని చేసింది. ఇప్పటివరకు 6వేల మంది వీసాలను క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనాలు నడపడం, చోరీలు, ఉగ్రవాదానికి మద్దతు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

News August 20, 2025

ఎయిర్ ఇండియాకు IOC హరిత ఇంధనం

image

ఎయిర్ ఇండియాకు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌(SAF) సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOC) ఒప్పందం కుదుర్చుకుంది. హోటల్, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెలతో SAF ఉత్పత్తి చేపట్టేందుకు IOC సన్నాహాలు చేస్తోంది. హరియాణాలోని పానిపట్ రిఫైనరీలో ఏటా 35 వేల టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు ఛైర్మన్ అర్విందర్ సింగ్ తెలిపారు. ఈ ఫ్యూయెల్‌తో వాయు కాలుష్యం తగ్గుతుందని వెల్లడించారు.