News August 18, 2025
నిజాంపట్నం పోర్టుకు 3వ ప్రమాద హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది. ఆదివారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపట్నం పోర్టుకు సోమవారం 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 19, 2025
రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.
News August 19, 2025
కరీంనగర్: WOW.. నీటిపై మబ్బులు.. PHOTO!

కరీంనగర్‌లోని లోయర్ మానేరు జలాశయం వద్ద ఓ అపూర్వమైన ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటోంది. మబ్బులు నీటిపైకి వచ్చినట్లు కనిపించే ఈ దృశ్యం చూసిన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. నీలి ఆకాశం, నిశ్శబ్దంగా ప్రవహించే జలాలతో కలిసి, ఆకాశంలోని మబ్బులు నీటిపై తేలుతున్నట్లు ఓ కలల ప్రపంచాన్ని తలపిస్తోంది. ఈ అరుదైన చిత్రాన్ని Way2News క్లిక్ మనిపించింది. #నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.
News August 19, 2025
USతో ఉక్రెయిన్ భారీ వెపన్ డీల్!

USకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ $100 బిలియన్ల వెపన్ డీల్ ఆఫర్ చేసినట్లు Financial Times వెల్లడించింది. ట్రంప్‌తో భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూరప్ ఫండ్స్‌తో US నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. బదులుగా రష్యాతో వార్ తర్వాత తమకు భద్రత కల్పించాలని కోరినట్లు చెప్పింది. దీంతో ట్రంప్‌కు కావాల్సింది ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.