News August 18, 2025
రికార్డు స్థాయిలో 23.6సెం.మీల వర్షపాతం

TG: రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట(D) గౌరారంలో అత్యధికంగా 23.6cmల వర్షపాతం నమోదైంది. ములుగు(సిద్దిపేట)లో 18.6cm, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.85cm, పిట్లం(కామారెడ్డి)లో 17.3cm, కౌడిపల్లి(మెదక్)లో 17.2cm, సంగారెడ్డిలో కంగ్టిలో 16.6cm, శంకరంపేట(మెదక్)లో 16.4cm, అడ్డగూడురు(యాదాద్రి)లో 16.4cmల వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.
Similar News
News August 20, 2025
లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నియంత్రించేందుకు రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు విముఖత చూపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాల నేతలు వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై చర్చకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ ఉదయం కూడా సభ వాయిదా పడింది.
News August 20, 2025
‘ప్రపంచ దోమల దినోత్సవం’ పుట్టుకకు వేదిక సికింద్రాబాద్

బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ 1897 AUG 20న సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్లో పని చేస్తున్నప్పుడు దోమల్లో మలేరియా ప్లాస్మోడియం ఉనికిని గుర్తించారు. ఇవి మలేరియా వ్యాప్తికి మాధ్యమంగా పనిచేస్తాయని నిరూపించారు. ఈ ఆవిష్కరణ ఆయనకు 1902లో నోబెల్ తెచ్చిపెట్టింది. ఆయన ఆవిష్కరణను స్మరించుకునేందుకే ఈ ప్రపంచ దోమల దినోత్సవం మొదలైంది. ఈ రోజు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా గురించి అవగాహన కల్పిస్తారు.
News August 20, 2025
VIRAL: ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేస్తే రూ.20 ఫైన్

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి ఆహారాన్ని కొందరు ఎక్కువగా ఆర్డర్ చేసి వేస్ట్ చేస్తుంటారు. అలాంటి వారిని ఫైన్‌తో శిక్షించే ఓ రెస్టారెంట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పుణేలోని ఓ రెస్టారెంట్‌లో సరసమైన ధరలకే ఎన్నో రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌ను వేస్ట్ చేస్తే మాత్రం రూ.20 ఫైన్ చెల్లించాల్సిందే. దీనికి సంబంధించిన హోటల్ బోర్డును ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది.