News August 18, 2025
నాగర్‌కర్నూల్‌లో పాఠశాలలకు సెలవు

నాగర్‌కర్నూల్‌లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాకపోకలకు అంతరాయం ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని డీఈవో రమేశ్ కుమార్ ఆదేశించారు. అంతేకాకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా పాఠశాలల ప్రాంగణాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు.
Similar News
News August 20, 2025
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుపై కదలిక

తెలంగాణలో విమానయాన రంగం కొత్త ఊపు అందుకోబోతోంది. వరంగల్, ఆదిలాబాద్‌లో నిలిచిపోయిన విమానాశ్రయ ప్రణాళికలలో ఇప్పుడు మళ్లీ కదలికలు మొదలయ్యాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ రెండు నగరాల్లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలను వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయం ఏర్పాటుతో ఆదిలాబాద్‌లో ఖనిజ, అటవీ సంపద ఆధారిత వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
News August 20, 2025
ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే: రేవంత్

TG: ప్రపంచస్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్థాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించినా ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని నొక్కి చెప్పారు.
News August 20, 2025
హాస్య నటుడు పద్మనాభం మన కడప జిల్లా వాసే.!

హాస్యనటుడు పద్మనాభం మన కడప జిల్లా వాసి అన్న విషయం మీకు తెలుసా? అవును నిజమే ఆయన కడప జిల్లా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. ఎన్నో సినిమాల్లో హాస్యాన్ని పంచిన ఆయన మద్రాసులో స్థిరపడ్డారు. అప్పుడప్పుడు రైలులో కొండాపురం వచ్చేవారు. అక్కడి నుంచి సింహాద్రిపురం బస్సులో వెళ్లేవారు. పులివెందుల, కడప నగరాలకు పనుల మీద ఎక్కువగా వస్తుండేవారు. సింహాద్రిపురంలో వారికి ఇల్లు కూడా ఉంది. కాగా నేడు ఆయన జయంతి.