News August 18, 2025

మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా వినతుల స్వీకరణ: కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి దరఖాస్తులు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వర్షాలు, వరదల వల్ల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ వ్యక్తిగత, ఇతర సమస్యలపై వినతి పత్రాలు వచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కలెక్టరేట్లో డెస్క్ అందుబాటులో ఉంటుందన్నారు.

Similar News

News August 18, 2025

మెదక్: సర్దార్ సర్వాయి పాపన్నకు కలెక్టర్ నివాళులు

image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. బీసీ బడుగు, బలహీన వర్గాల ఐక్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్ర రాజు తదితరులు ఉన్నారు.

News August 18, 2025

పోలీసులు సివిల్ విషయాలకు వెళ్లొద్దు: ఎస్పీ

image

జిల్లా పోలీసులు సివిల్ విషయాలలో తల దుర్చావద్దని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. సోమవారం మాట్లాడుతూ.. ఎవరైన సివిల్ తగాదాల్లో తలదూర్చితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇది వరకు సివిల్ తగాదాలో పోలీసుల ద్వారా జిల్లాలో ఏవరైనా బాధించినట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 57888 లేదా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.

News August 18, 2025

మెదక్: భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. వర్షాల వల్ల జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ఏ ఆపద వచ్చిన లోకల్ పోలీస్ అధికారులు, డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 87126 57888 నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.