News August 18, 2025
అంబేడ్కర్ యూనివర్సిటీకి సెలవు: VC

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటించారు. స్థానిక వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కె.ఆర్. రజిని ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలకు కూడా సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News August 20, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

డా. బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ డిగ్రీ రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్శిటీ ఎగ్జామ్స్ యూజీ డీన్ డా. జి. పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,957 మంది విద్యార్థులు హాజరు కాగా 37.58 శాతం మంది ఉత్తీర్ణత చెందారన్నారు. రిజల్ట్స్‌ను జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలన్నారు.
News August 20, 2025
కాశీబుగ్గలో 25న జాబ్ మేళా

కాశీబుగ్గలోని సాయి శిరీషా డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో 25న జాబ్ మేళా జరగనుంది. 18 నుంచి 34 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులని ఆ సంస్థ అధికారి సాయికుమార్ తెలిపారు. 16 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.
News August 20, 2025
ఏపీలో శ్రీకాకుళం జిల్లా ముందంజ: కలెక్టర్

పీ-4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా ఏపీలో ముందంజలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్‌లో మాట్లాడారు. 64,166 బంగారు కుటుంబాల్లో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. రహదారుల మీదుగా వేలాది మొక్కలు నాటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.