News August 18, 2025

ఖమ్మం: పంట.. వర్షం తంటా!

image

ఎడతెరిపి లేని వర్షాలతో రైతు అవస్థలు పాలవుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసి చేతికందే దశలో పంటలు వర్షాలకు నీటిపాలవుతున్నాయి. ఇప్పటికే వరదల కారణంగా కొంత మేరకు పత్తి, వరి పంటలు జలమయం కాగా ప్రతి రోజు విరామం లేకుండా కురుస్తున్న వర్షానికి పంటలు నేలవారటం తోపాటు కుళ్ళిపోతున్నాయి. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ గ్రామాల్లో ఆ పరిస్థితి ఉందా..?

Similar News

News August 18, 2025

స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలి: BSP

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇటుక, స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలని BSP జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందించారు. నిరుపేదలు అప్పుల బారిన పడకుండా రూ.5 లక్షల లోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 18, 2025

హక్కుల సాధనకు సంఘటితమవుదాం

image

విచ్ఛిన్నకర శక్తులకు శాంతి మార్గంలో తగిన గుణపాఠం చెప్పేందుకు తమ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ముందుకు సాగుతోందని జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ అన్నారు. సోమవారం ఖమ్మం నిజాంపేట ప్రాంత నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. హక్కుల సాధనకు సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

News August 18, 2025

వందేళ్ల వృద్ధురాలి భౌతికకాయం దానం

image

మధిర పట్టణం బంజారా కాలనీకి చెందిన రమావత్ మంగమ్మ(100) సోమవారం మృతి చెందారు. ఈమె మృతదేహాన్ని వైద్య విద్యార్థుల బోధన-అభ్యసన అవసరాల నిమిత్తం ఖమ్మంలోని వైద్య కళాశాలకు అందించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళి అర్పించారు. ఈమె జీవితమంతా శ్రీరాముడి భక్తిలో గడిపి, స్థానిక ఆలయానికి ఎంతో సేవ చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు.