News August 18, 2025
వర్షాలు.. ఫోన్ చేయండి: MBNR ఎస్పీ

నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి విజ్ఞప్తి చేశారు. వర్షాల వల్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తునందున ఏ ఆపద వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్-100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో పోలీస్ అధికారులను, సిబ్బందిని సిద్ధం చేశామన్నారు.
SHARE IT
Similar News
News September 4, 2025
MBNR: PU STUFF.. విజేతలు మీరే..!

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
✒క్రికెట్ విజేత:ప్రొ.రమేష్ బాబు జట్టు
రన్నర్స్:Dr.N.చంద్ర కిరణ్ జట్టు
✒కార్రోమ్స్(మహిళ విభాగం)
విజేతలు:చిన్నాదేవి & శారద
రన్నర్స్:స్వాతి & N.శారద
✒వాలీబాల్(పురుష విభాగం)
విజేతలు:ప్రొ.G.N శ్రీనివాస్ జట్టు
రన్నర్స్:ప్రొ.రమేష్ బాబు జట్టు
✒త్రో బాల్(మహిళ విభాగం)
విజేతలు:రాగిణి & టీం
రన్నర్స్:కల్పన & టీం.
News September 4, 2025
MBNR: PU STUFFకు ముగిసిన క్రీడలు

పాలమూరు యూనివర్సిటీలో టీచర్స్ డే సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు నేటితో ముగిశాయి. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేష్ బాబు పర్యవేక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, ప్రిన్సిపాళ్లు డా.మధుసూదన్ రెడ్డి, డా.కరుణాకర్ రెడ్డి, డా.రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 4, 2025
MBNR: వినాయక నిమజ్జనం.. ఏర్పాటు సిద్ధం- SP

MBNRలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని విధాలైన భద్రతా, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులు సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామని పేర్కొన్నారు.