News August 18, 2025

RAIN: MBNR ఎస్పీ.. కీలక సూచనలు!

image

✒శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, మట్టీ గోడల ఇండ్లలో ఉండరాదు.
✒అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.
✒తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు.
✒ఇనుప వైర్‌లపై బట్టలు ఆరబెట్టరాదు.
✒రైతులు బావులు, బోర్ల వద్ద స్టార్టర్, ఫ్యూజ్ బాక్స్‌లను తాకరాదు.
✒చిన్నపిల్లలు, ఈత రాని వారు చెరువుల్లో ఈతకు లేదా చేపల వేటకు వెళ్లరాదు.
✒వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి.

Similar News

News September 4, 2025

MBNR: PU STUFF.. విజేతలు మీరే..!

image

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
✒క్రికెట్ విజేత:ప్రొ.రమేష్ బాబు జట్టు
రన్నర్స్:Dr.N.చంద్ర కిరణ్ జట్టు
✒కార్రోమ్స్(మహిళ విభాగం)
విజేతలు:చిన్నాదేవి & శారద
రన్నర్స్:స్వాతి & N.శారద
✒వాలీబాల్(పురుష విభాగం)
విజేతలు:ప్రొ.G.N శ్రీనివాస్ జట్టు
రన్నర్స్:ప్రొ.రమేష్ బాబు జట్టు
✒త్రో బాల్(మహిళ విభాగం)
విజేతలు:రాగిణి & టీం
రన్నర్స్:కల్పన & టీం.

News September 4, 2025

MBNR: PU STUFFకు ముగిసిన క్రీడలు

image

పాలమూరు యూనివర్సిటీలో టీచర్స్ డే సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు నేటితో ముగిశాయి. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేష్ బాబు పర్యవేక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, ప్రిన్సిపాళ్లు డా.మధుసూదన్ రెడ్డి, డా.కరుణాకర్ రెడ్డి, డా.రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 4, 2025

MBNR: వినాయక నిమజ్జనం.. ఏర్పాటు సిద్ధం- SP

image

MBNRలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని విధాలైన భద్రతా, బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులు సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామని పేర్కొన్నారు.