News August 18, 2025
అధికారులతో విశాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి భేటీ

విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డా.డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. రెండు రోజులుగా విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఆరా తీశారు. అనంతం గీతం కాలేజీకి బయలుదేరి వెళ్లారు.
Similar News
News August 18, 2025
సంక్షేమ వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తాం: మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా తొమ్మిది జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో రీజినల్ వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహాలలో ఉన్న సమస్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.
News August 18, 2025
గంట ఆలస్యంగా బయలుదేరనున్న విశాఖ- రాజమండ్రి ప్యాసింజర్

విశాఖ నుంచి సోమవారం రాత్రి 7:20 గంటలకు రాజమండ్రి ప్యాసింజర్ బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజు విశాఖ నుంచి సాయంత్రం 6:20 గంటలకు ఈ పాసింజర్ బయలుదేరుతుందని.. అయితే అనివార్య కారణాలవల్ల గంట ఆలస్యంగా సోమవారం బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు దీన్ని గమనించాలని కోరారు.
News August 18, 2025
విశాఖ: డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఉచిత శిక్షణ

డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-45 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. మహారాణిపేటలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.