News August 18, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. పత్తి ధర ఎంతంటే..?

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,720 ధర పలకగా.. సోమవారం రూ.7,660కి పడిపోయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News August 20, 2025

NRPT: ‘శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి’

image

శాంతియుత వాతావరణంలో పండగలను నిర్వహించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి హాజరయ్యారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరుపుకోవాలని చెప్పారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఉత్సవాలకు పటిష్ట పోలీస్ భద్రత ఉంటుందన్నారు.

News August 20, 2025

ఇబ్రహీంపట్నం: దంపతుల అదృశ్యం.. కేసు నమోదు

image

ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన బోడ రవి(50), బోడ ప్రమీల(45) అనే దంపతులిద్దరూ అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ బుధవారం తెలిపారు. ఈనెల 16న ఇంట్లో నుండి వెళ్లినవారు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని వారి కూతురు అంబటి మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వారి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

News August 20, 2025

SRPT: ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

image

కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్నను నల్గొండ రేంజ్ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కలప వ్యాపారం చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు ఓ వ్యాపారి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం బాధితుడి నుంచి రూ.20 వేలు తీసుకుని తన బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు.