News August 18, 2025
NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముకురాలకి చెందిన వింజమూరి ఈశ్వరయ్య(55) నిన్న రాత్రి భోజనం చేస్తుండగా గుడ్డు గొంతులో ఇరుక్కుంది. దీంతో అపస్మారక స్థితిలోకెళ్లిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News August 20, 2025
పోచారం ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ డీఈ

పోచారం ప్రాజెక్టును డీఈ వెంకటేశ్వర్లు ఈరోజు పరిశీలించారు. లింగంపేట పెద్దవాగు, గుండారం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి 3,904 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 22 అడుగుల నీరు ఉందని చెప్పారు. 3,854 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో నీటి పారుదలశాఖ సిబ్బంది ఉన్నారు.
News August 20, 2025
కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు బ్రేక్!

HYDలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ప్రభుత్వం <<17454341>>తొలగిస్తున్న<<>> విషయం తెలిసిందే. దీనిపై కేబుల్ ఆపరేటర్లు TG SPDCL CMDతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని TG SPDCL నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను తొలగించాలని, రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని CMD సూచించారని పేర్కొన్నారు.
News August 20, 2025
NRPT: ‘శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి’

శాంతియుత వాతావరణంలో పండగలను నిర్వహించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా బుధవారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి హాజరయ్యారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా జరుపుకోవాలని చెప్పారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. ఉత్సవాలకు పటిష్ట పోలీస్ భద్రత ఉంటుందన్నారు.