News August 18, 2025

మత్స్యకారులు వేటకు పోవద్దు.. శ్రీకాకుళం కలెక్టర్ సూచనలు

image

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News August 18, 2025

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 138.6 వర్షపాతం నమోదు

image

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 మండలాల్లో 16 మండలాల్లో కురిసిన భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం మధ్యాహ్ననానికి జిల్లా మొత్తం మీద 138.6 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.4మి.మీ రికార్డు అయింది. వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో, కాలువుల్లో నీరు చేరుతుంది.

News August 18, 2025

శ్రీకాకుళం: ఆత్మహత్యకు యత్నించిన..కేజీబీవీ ప్రిన్సిపల్

image

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఇటీవల కవిటికి బదిలీ అయిన సౌమ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే ఈమె బదిలీ వివాదం కొనసాగుతోంది. పలు యూనియన్లు ఈమెకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సూసైడ్ కలకలం రేపుతుంది. శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

News August 18, 2025

అంగన్వాడీ సిబ్బంది కేంద్రాల్లో ఉండాలి: ఐసీడీఎస్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల నేపథ్యంలో సోమవారం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్ చిన్నారులకు సెలవు ప్రకటించినట్లు ఐసీడీఎస్ పీడీ ఐ.విమల తెలిపారు. అయితే కార్యకర్తలు, సహాయకులు కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా స్టాక్ నిల్వలను భద్రంగా ఉంచాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. సిబ్బందిపై సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేయాలని ఆమె స్పష్టం చేశారు.