News August 18, 2025
తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్

తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్‌లో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉన్నారన్నారు. మరో కేసులో కొల్లిపరలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Similar News
News August 18, 2025
GNT: ‘పీజీఆర్ఎస్‌కి 33, డీవైసీకి 16 ఫిర్యాదులు’

జీఎంసీ డయల్ యువర్ కమిషనర్‌కి 16, పీజీఆర్ఎస్‌కి 33 ఫిర్యాదులు అందాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 14 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువు తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించారు.
News August 18, 2025
మన గుంటూరు హీలియం పుట్టినిల్లు

హీలియం అనే పదం వినగానే మనలో చాలామందికి బెలూన్లు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ హీలియంను గుంటూరులో కనుగొన్నారు. 1868, ఆగస్టు 18న సూర్యగ్రహణం సమయంలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జూల్స్ జాన్సెన్ సూర్యునిలోని ఓ గీతలో ఒక కొత్త మూలకాన్ని కనుగొన్నారు. ఆ మూలకానికి ఆయన హీలియం అని పేరు పెట్టారు. భూమిపై ఇంతకుముందు ఈ మూలకం ఉనికి లేకపోవడంతో ఇది గుంటూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.
News August 18, 2025
ANU: పరీక్షల షెడ్యూల్ విడుదల

ANU పరిధిలోని కాలేజీల్లో బీ-ఫార్మసీ II/IV 4వ, III/IV 6వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15, 16 తేదీల నుంచి పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు జరిమానా లేకుండా ఈనెల 28లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in ను సందర్శించవచ్చని పేర్కొంది.