News April 1, 2024

మల్కాజిగిరిలో తెరపైకి లోకల్- నాన్ లోకల్ ఇష్యూ

image

మల్కాజిగిరి MP సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు BRS గెలుపొందలేదు. తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న రోజుల్లోనూ, KCR హవా నడుస్తున్న సమయంలోనూ ఇక్కడ TDP, కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ శ్రమిస్తోంది. ఈ దశలోనే BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ అని.. సునీతామహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (BJP) నాన్ – లోకల్ అని BRS శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Similar News

News March 10, 2026

దిల్‌సుఖ్‌నగర్‌లో ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’

image

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌కు భారీగా తరలిరావాలన్నారు.

News March 10, 2026

HYD: గ్రేటర్‌లో గ్యాస్‌ మంట.. ఆరిపోతున్న పొయ్యిలు!

image

గ్రేటర్‌ HYDలో గ్యాస్‌ సెగ రేగుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల సాకుతో వాణిజ్య సిలిండర్ల సరఫరాకు బ్రేక్‌ పడటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలకు తోడు.. రీఫిల్లింగ్‌ గడువును 25 రోజులకు పెంచడం వ్యాపారులకు శాపంగా మారింది. డొమెస్టిక్‌ సిలిండర్లకే మొగ్గు చూపుతుండటంతో వాణిజ్య అవసరాలకు కొరత ఏర్పడిందని హోటల్‌ యజమానులు విలవిలలాడుతున్నారు.

News March 10, 2026

HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

image

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.