News April 1, 2024
ఎండలు భగభగ.. వడగాల్పుల సెగ
ఏపీలో నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయి. కడప, నంద్యాల, కర్నూలు, ATP జిల్లాల్లో 40-43 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 40-44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, SKLM, కాకినాడ, తూ.గో జిల్లాల్లోనూ 40- 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Similar News
News November 7, 2024
శీతాకాలంలో శరీర రక్షణకు ఇవి అవసరం
శీతాకాలం వచ్చేసింది. అనేక ఆరోగ్య సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పండ్లు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి సమృద్ధిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
News November 7, 2024
బెల్టుషాపులపై మంత్రి కీలక ఆదేశాలు
AP: ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టుషాపులను ఉపేక్షించవద్దని ఆదేశించారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలు ఇవ్వాలని సూచించారు. కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు.
News November 7, 2024
ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు
AP: ఉద్యోగ భద్రత సర్క్యులర్ యథావిధిగా అమలు చేయడంతో పాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసనలు చేపట్టనుంది. ఈ నెల 19, 20న ప్రొటెస్ట్ చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చింది. సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని సూచించింది. ఆర్టీసీ డిపోలు, వర్క్ షాప్‌ల వద్ద ధర్నాలు చేయాలని ఉద్యోగులకు సూచించింది.