News August 18, 2025
MNCL: రైలులో ప్రయాణిస్తూ వ్యక్తి మృతి

రైలులో ప్రయాణిస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఛత్తీస్‌గడ్‌కు చెందిన ధన్పత్ లాల్ యాదవ్ తమిళనాడులో పనిచేసేందుకు గ్రామస్తులతో కలిసి రైలులో వెళుతుండగా అస్వస్థతకు గురయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపగా.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 18, 2025
మాల్కాజ్‌గిరి: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గణేశ్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలు, నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్సవ నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ, నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News August 18, 2025
సిద్దిపేట: ‘ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత’

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 114 అర్జీలు వచ్చాయన్నారు.
News August 18, 2025
సిద్దిపేట: 32 మందికి జరిమానా.. ఒకరికి జైలు శిక్ష

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుపడ్డ 32 మందికి రూ.59,500 జరిమానా, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఈరోజు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని, బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ కాంతారావు ముందు హాజరుపర్చగా తీర్పు వెల్లడించారు.