News August 18, 2025
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.
Similar News
News August 18, 2025
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్ చేశారు: మోదీ

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తనకు ఫోన్ చేశారని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవల అలస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీలో చర్చించిన అంశాల గురించి తనకు వివరించారని PM ట్వీట్ చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం జరిగే ప్రయత్నాలన్నింటికీ భారతదేశ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పుతిన్‌తో మరిన్ని సంభాషణలు జరిపేందుకు ఎదురుచూస్తున్నామన్నారు.
News August 18, 2025
లిక్కర్ స్కాం కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సహా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లనూ కొట్టేసింది.
News August 18, 2025
రాజధాని పరిధిలో ₹904 కోట్లతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

AP: రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ₹904 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ‘రోడ్ల నిర్మాణానికి ₹339Cr కేటాయిస్తున్నాం. పనులకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. భూసేకరణలో “అసైన్” పదాన్ని తీసేయాలని నిర్ణయించాం. రాజధానిలో ₹411Crతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మిస్తాం’ అని చెప్పారు.