News August 18, 2025
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లాలో డీజే, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగం పూర్తిగా నిషిద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News August 18, 2025
మాల్కాజ్‌గిరి: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గణేశ్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలు, నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్సవ నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ, నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News August 18, 2025
సిద్దిపేట: ‘ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత’

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 114 అర్జీలు వచ్చాయన్నారు.
News August 18, 2025
సిద్దిపేట: 32 మందికి జరిమానా.. ఒకరికి జైలు శిక్ష

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుపడ్డ 32 మందికి రూ.59,500 జరిమానా, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఈరోజు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని, బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ కాంతారావు ముందు హాజరుపర్చగా తీర్పు వెల్లడించారు.