News August 18, 2025
భూపాలపల్లి: పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: కలెక్టర్

సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం పాపన్న 375వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దోపిడీ, భూస్వాముల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప బహుజన విప్లవకారుడు పాపన్న అని కొనియాడారు. 12 మందితో సైన్యం స్థాపించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప వీరుడని అన్నారు.
Similar News
News August 18, 2025
ఫ్రీ బస్సు.. ఏయే రాష్ట్రాల్లో అమలవుతోందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో అమలుతో దేశంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు చేరింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ మహిళలకు బస్సులో జీరో టికెట్ అందిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో మహిళలకు తాత్కాలికంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
News August 18, 2025
SRD: మహిళ తలపై నుంచి వెళ్లిన బస్సు టైర్

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని మహిళ మృతి చెందింది. పోలీసులు వివరాలు.. నిజాంపేట్(M) బాచుపల్లికి చెందిన సంతోషి(48) అతని కొడుకు పరమేష్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా లక్డారం వద్ద ఈ ఘటన జరిగింది. పటాన్‌చెరు నుంచి పిట్లం వెళ్తున్న RTC బస్సు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో సంతోషి బస్సు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పరమేశ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News August 18, 2025
బోయపల్లి ఎస్సీ కాలనీలో కలెక్టర్ పర్యటన

తాండూర్ మండలం బోయపల్లి గ్రామ ఎస్సీ కాలనీని కలెక్టర్ దీపక్ కుమార్ సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి సందర్శించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.