News August 18, 2025

మైదుకూరు: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

image

మైదుకూరులోని పోరుమామిళ్ల రోడ్డులో ఎర్ర చెరువు సమీపంలో సోమవారం రాటాల పవన్ కుమార్ (38) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయం మోటార్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News August 23, 2025

కడప: ఫలితాలు విడుదల

image

YVU డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొ. శ్రీనివాసరావు విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వోకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు 1,012 మంది విద్యార్థులు హాజరు కాగా.. 977 పాస్ అయ్యారని తెలిపారు. ఫలితాల కోసం https:www.yvuexams.in ను సంప్రదించాలన్నారు. ఈ ఫలితాలను విడుదల చేసిన వారిలో రిజిస్ట్రార్ పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. కేఎస్వీ కృష్ణారావు ఉన్నారు.

News August 23, 2025

కడప: ‘దరఖాస్తులు తక్కువ వస్తే రుసుము వాపస్’

image

ఒక్కో బార్‌కు నాలుగు కన్నా తక్కువ ధరకాస్తులు వస్తే, దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు వాపస్ చేస్తామని జిల్లా ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. అయితే ప్రాసెసింగ్ పీజు మాత్రం వెనక్కు ఇవ్వరన్నారు. వాటిని రద్దుచేసి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని టెండరు దారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 29 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు.

News August 23, 2025

యూరియా డీలర్లతో కలెక్టర్ సమావేశం

image

యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్లను హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి వ్యవసాయ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, ఫర్టిలైజర్స్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దాదాపు 430 ప్రైవేట్ ఫర్టిలైజర్స్ షాపుల వద్ద యూరియా ఎరువుల వివరాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. JC అధితిసింగ్, DAO చంద్రానాయక్ పాల్గొన్నారు.