News August 18, 2025
GNT: ‘పీజీఆర్ఎస్‌కి 33, డీవైసీకి 16 ఫిర్యాదులు’

జీఎంసీ డయల్ యువర్ కమిషనర్‌కి 16, పీజీఆర్ఎస్‌కి 33 ఫిర్యాదులు అందాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 14 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువు తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News August 18, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ అమరావతి అంతా లోతట్టు ప్రాంతం: అంబటి.
☞ తాడికొండ: సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో రచ్చ.
☞ తెనాలి: తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్.
☞ ప్రత్తిపాడు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు.
☞ అమరావతి: అసైన్డ్ రైతులకు శుభవార్త.
☞ మంగళగిరి: CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.
☞ పొన్నూరు: కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.
☞ GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం.
News August 18, 2025
గుంటూరు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు

కాకుమాను మండలంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ బలసాని కిరణ్ కుమార్ సోమవారం పర్యటించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.
News August 18, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మీ, SP సతీశ్ కుమార్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీన సీకే కన్వెన్షన్‌లో ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం. 20న మంగళగిరి మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. కలెక్టర్, SP సభాస్థలం, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.