News August 18, 2025

తిరుమలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుకే పెట్టలేదు: మంత్రి

image

తిరుపతి నుంచి <<17428145>>తిరుమలకు<<>> వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయకపోవడానికి గల కారణాలను మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ‘తిరుమలకు ఫ్రీ బస్ పెడితే జనం ఎక్కువగా ఎక్కుతారు. కొండపై ఎక్కువ మందితో బస్సులు నడవడం ప్రమాదకరం. ఘాట్ రోడ్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్లాలి. లేదంటే బస్సులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కొండపైకి వెళ్లాక అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది’ అని గుర్తుచేశారు.

Similar News

News August 18, 2025

ఫ్రీ బస్సు.. ఏయే రాష్ట్రాల్లో అమలవుతోందంటే?

image

ఆంధ్రప్రదేశ్‌లో అమలుతో దేశంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు చేరింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ మహిళలకు బస్సులో జీరో టికెట్ అందిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో మహిళలకు తాత్కాలికంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

News August 18, 2025

కలెక్షన్లలో చరిత్ర సృష్టించిన ‘కూలీ’

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీ మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఈ నెల 14న రిలీజైన ఈ మూవీ రూ.404+ కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తమిళ సినీ చరిత్రలో 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిందని తెలిపింది. ఈ జోరు కొనసాగితే ‘జైలర్’ వసూళ్లను అధిగమించే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News August 18, 2025

నేషనల్ అవార్డ్స్ విజేతలకు సీఎం సన్మానం

image

TG: భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా HYDను నిల‌పాల‌ని CM రేవంత్ అన్నారు. సినిమా రంగానికి అవ‌స‌ర‌మైన చేయూత‌నందిస్తామ‌ని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన సినీ ప్ర‌ముఖులు ఆయన్ను మర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను CM దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం దర్శకులు అనిల్ రావిపూడి, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, సాయి రాజేశ్‌ తదితరులను CM స‌న్మానించారు.