News August 18, 2025
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. నిఫ్టీ 25 వేల మార్క్‌కు కొద్ది దూరంలో ఆగిపోయింది. సెన్సెక్స్ 676 పాయింట్ల లాభంతో 81,273, నిఫ్టీ 251 పాయింట్లు ఎగిసి 24,882 వద్ద ముగిశాయి. GST సంస్కరణలపై PM ప్రకటన మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో టాప్ గెయినర్స్. ITC, ఎటర్నల్, టెక్ మహీంద్రా, L&T, NTPC టాప్ లూజర్స్.
Similar News
News August 18, 2025
ఫ్రీ బస్సు.. ఏయే రాష్ట్రాల్లో అమలవుతోందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో అమలుతో దేశంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు చేరింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ మహిళలకు బస్సులో జీరో టికెట్ అందిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో మహిళలకు తాత్కాలికంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
News August 18, 2025
కలెక్షన్లలో చరిత్ర సృష్టించిన ‘కూలీ’

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీ మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఈ నెల 14న రిలీజైన ఈ మూవీ రూ.404+ కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తమిళ సినీ చరిత్రలో 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిందని తెలిపింది. ఈ జోరు కొనసాగితే ‘జైలర్’ వసూళ్లను అధిగమించే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News August 18, 2025
నేషనల్ అవార్డ్స్ విజేతలకు సీఎం సన్మానం

TG: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా HYDను నిలపాలని CM రేవంత్ అన్నారు. సినిమా రంగానికి అవసరమైన చేయూతనందిస్తామని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన సినీ ప్రముఖులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను CM దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దర్శకులు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్ తదితరులను CM సన్మానించారు.