News August 18, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశముందని, అనంతపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు, కూలీలు టవర్లు, చెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దన్నారు. సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని సూచించారు.

Similar News

News August 18, 2025

ఎస్కేయూలో సీట్ల అలాట్‌మెంట్

image

అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ అధికారులు సోమవారం సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు. ఇటీవల 2 కౌన్సెలింగ్‌లలో సీట్లు కేటాయించడంతో అలాట్మెంట్ ఆర్డర్‌తో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సీట్ల అలాట్‌మెంట్‌కి హాజరయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, సిబ్బంది ధ్రువ పత్రాలను పరిశీలించారు.

News August 18, 2025

యూరియా వినియోగంపై నిఘా ఉంచాలి: కలెక్టర్

image

యూరియా వినియోగంపై అధికారులు నిఘా ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 29,527 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. 26,008 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా 3,519 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News August 18, 2025

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

PGRS అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అనంతపురంలోని ఆయా శాఖల జిల్లా అధికారులు నాణ్యతగా అర్జీలను పరిష్కరించాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వం వహించరాదన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.