News August 18, 2025

VZM: ప్రజల నుంచి 27 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 27 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 11 ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.

Similar News

News August 18, 2025

బాలికను మోసగించిన వ్యక్తికి జైలు శిక్ష: DSP

image

విజయనగరం మహిళ పోలీసు స్టేషన్‌‌లో 2023లో నమోదైన పొక్సో కేసులో కొత్తపేటకు చెందిన యువకుడికి ఏడాది జైలు, రూ.1000 ఫైన్‌ను కోర్టు విధించిందని DSP గోవిందరావు తెలిపారు. లక్ష్మణరావు అనే యువకుడు ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక నేరానికి పాల్పడి మోసగించాడన్నారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.

News August 18, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ సోమవారం సూచించారు. గ్రామాల్లో పర్యటించి పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని, పారిశుద్ధ్య వ్యవస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. నాగావళి పరివాహక ప్రాంతాలైన సంతకవిటి, రేగిడి, వంగర, ఆర్.ఆముదాలవలస మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

News August 18, 2025

VZM: అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు

image

భారీ వర్షాలు కారణంగా జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నతాధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినప్పటికీ.. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటనపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో యూనియన్ ప్రతినిధులు ఉన్నతాధికారులను సంప్రదించగా నేడు సెలవును ప్రకటించినట్లు తెలిసింది.