News August 18, 2025
విశాఖ: డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఉచిత శిక్షణ

డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సోమవారం తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసి 18-45 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులన్నారు. 3 నెలల శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. మహారాణిపేటలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.
Similar News
News August 18, 2025
విశాఖ: గీత కులాలకు 10 మద్యం బార్లు కేటాయింపు

గెజిట్ బార్ పాలసీకి అనుగుణంగా జీవీఎంసీ పరిధిలో గీత కులంలోని ఉపకులాలకు పది మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టరేట్ వీసీ హాలులో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ డ్రా తీసి అర్హులను ఎంపిక చేశారు. ఈ మద్యం దుకాణాల కేటాయింపుల్లో 6 శెట్టిబలిజ, 4 యాత కులానికి దక్కినట్లు తెలిపారు.
News August 18, 2025
ఆల్ ఇండియా లిబరల్ పార్టీకి కలెక్టర్ షోకాజ్ నోటీసు

గడిచిన ఆరేళ్లలో ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని, రిజిస్టర్ అయ్యి గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆల్ ఇండియా లిబరల్ పార్టీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రతినిధులు సెప్టెంబర్ 8వ తేదీలోగా రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కావాలన్నారు.
News August 18, 2025
ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదే: అమర్నాథ్

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 34 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు టెండర్లు పిలిచినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ప్రధాని ముందే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పిన పార్టీ వైసీపీ అని అన్నారు.