News August 18, 2025

భారత్, పాక్ మ్యాచ్.. 10 సెకండ్లకు రూ.16లక్షలు

image

దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి మొదలవనున్న ఆసియా కప్‌లో భారత్, పాక్ తలపడే మ్యాచ్‌లకు యాడ్స్ పరంగా భారీ డిమాండ్ నెలకొంది. ఈ టోర్నీని బ్రాడ్‌కాస్ట్ చేయనున్న సోనీ TVలో 10సెకండ్ల యాడ్ స్లాట్‌కు రూ.16 లక్షల ధర నిర్ణయించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. వచ్చే నెల 14న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. తర్వాత సూపర్-4 స్టేజ్‌లోనూ ఎదురుపడే అవకాశముంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే 28న టైటిల్ కోసం తలపడుతాయి.

Similar News

News August 18, 2025

రేపు భారీ వర్షాలు.. జాగ్రత్త: APSDMA

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. కోస్తా తీరం వెంట గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News August 18, 2025

స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

image

AP: భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేయాలని CSకు సూచించారు. ఉత్తరాంధ్రలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురికావడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

News August 18, 2025

ఫ్రీ బస్సు.. ఏయే రాష్ట్రాల్లో అమలవుతోందంటే?

image

ఆంధ్రప్రదేశ్‌లో అమలుతో దేశంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు చేరింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ మహిళలకు బస్సులో జీరో టికెట్ అందిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో మహిళలకు తాత్కాలికంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.