News August 18, 2025
కానూరు-మచిలీపట్నం రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌కు చెక్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో కలిశారు. కానూరు-మచిలీపట్నం రహదారిని విస్తరిస్తే విజయవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, రాజధాని అభివృద్ధికి తోడ్పడుతుందని లోకేశ్ వివరించారు. అలాగే, హైదరాబాద్-అమరావతి అనుసంధానంలో ముఖ్యమైన NH-65లో అదనపు పోర్టు లింకేజీని DPRలో చేర్చాలని కోరారు. గ్రీన్ కారిడార్లు, టోలింగ్, ట్రాఫిక్ వ్యవస్థల అభివృద్ధిలో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News August 18, 2025
సోమశిల- శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా

రేపు ప్రారంభం చేయబోయే సోమశిల – శ్రీశైలం లాంచీ ప్రయాణం వాయిదా వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్ వద్ద 10 గేట్లు ఎత్తారు. తిరుగు ప్రయాణంలో వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని వాయిదా వేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి 23వ తేదీన లాంచీ ప్రయాణాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
News August 18, 2025
ఎన్టీఆర్ జిల్లా TODAY TOP NEWS

☞ జగ్గయ్యపేటలో కెమికల్ రసాయన వ్యర్ధాలు.
☞ విజయవాడలో బస్సుల రద్దీ.. ప్రయాణికుల ఇబ్బందులు.
☞కంచికచర్లలో వివాహిత సూసైడ్.
☞ విజయవాడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి.
☞ నందిగామలో యాంకర్ అనసూయ సందడి.
☞ విజయవాడ: మహిళలకు వడ్డీ వ్యాపారుల వేధింపులు.
News August 18, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ అమరావతి అంతా లోతట్టు ప్రాంతం: అంబటి.
☞ తాడికొండ: సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో రచ్చ.
☞ తెనాలి: తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్.
☞ ప్రత్తిపాడు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు.
☞ అమరావతి: అసైన్డ్ రైతులకు శుభవార్త.
☞ మంగళగిరి: CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.
☞ పొన్నూరు: కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం.
☞ GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం.