News August 18, 2025
Airtel నెట్‌వర్క్ డౌన్.. యూజర్స్ ఫైర్

దేశంలోని పలు ప్రాంతాల్లో Airtel నెట్‌వర్క్ డౌన్ అయింది. దీనిపై యూజర్స్ SMలో ఫైర్ అవుతున్నారు. కాల్స్, ఇంటర్నెట్ సమస్యలతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ స్పందించింది. ‘మా టీం ఈ సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తోంది. త్వరలో సేవలను పునరుద్ధరిస్తాం. అసౌకర్యానికి క్షమించండి’ అని స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా?
Similar News
News August 18, 2025
రేపు భారీ వర్షాలు.. జాగ్రత్త: APSDMA

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. కోస్తా తీరం వెంట గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
News August 18, 2025
స్కూళ్లకు సెలవులపై సీఎం కీలక ఆదేశాలు

AP: భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లను అప్రమత్తం చేయాలని CSకు సూచించారు. ఉత్తరాంధ్రలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండ ప్రాంతాలు కోతలకు గురికావడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.
News August 18, 2025
ఫ్రీ బస్సు.. ఏయే రాష్ట్రాల్లో అమలవుతోందంటే?

ఆంధ్రప్రదేశ్‌లో అమలుతో దేశంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అందిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఆరుకు చేరింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లోనూ మహిళలకు బస్సులో జీరో టికెట్ అందిస్తారు. అలాగే మరికొన్ని రాష్ట్రాలు పండుగల సమయంలో మహిళలకు తాత్కాలికంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.