News August 18, 2025
పొంగులేటి క్యాంపు ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి పై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా తుంబూరు దయాకర్ రెడ్డి జాతీయ జెండా ఎగరేశారని బీఆర్ఎస్ నాయకుడు బానోత్ రవి(ఆర్మీ రవి) జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది నియోజకవర్గ ప్రత్యేకాధికారిని అవమానించినట్లేననీ, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
ఖమ్మం: విస్తృతంగా వాహన తనిఖీలు

రాత్రి వేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో జిల్లాలో డ్రంక్& డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. JAN-AUG 17 వరకు నిర్వహించిన డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడగా,వారిపై పోలీసులు వివిధ కోర్టుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు.
News August 18, 2025
యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: తుమ్మల

వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం HYD నుంచి యూరియా, ఎరువుల లభ్యతపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్ లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News August 18, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయండి : Dy CM భట్టి

మధిర పట్టణ సమగ్ర అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఒకసారి మున్సిపల్ ఇంజినీర్ ఇన్‌చీఫ్, 15 రోజులకు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు