News August 18, 2025

‘ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యల పరిష్కారం’

image

ఉద్యమాల ద్వారానే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వి అన్నారు. సోమవారం ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ మూడో వారంలో ఖమ్మంలో PDSU రాష్ట్ర 23వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు.

Similar News

News August 18, 2025

ఖమ్మం: విస్తృతంగా వాహన తనిఖీలు

image

రాత్రి వేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్‌రావు పర్యవేక్షణలో జిల్లాలో డ్రంక్& డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. JAN-AUG 17 వరకు నిర్వహించిన డ్రంక్‌&డ్రైవ్‌ తనిఖీల్లో 10,141 మంది వాహనదారులు పట్టుబడగా,వారిపై పోలీసులు వివిధ కోర్టుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలు చేశారు.

News August 18, 2025

యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: తుమ్మల

image

వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం HYD నుంచి యూరియా, ఎరువుల లభ్యతపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని ఈ సందేశం ఫీల్డ్ లెవల్ లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

News August 18, 2025

అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయండి : Dy CM భట్టి

image

మధిర పట్టణ సమగ్ర అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఒకసారి మున్సిపల్ ఇంజినీర్ ఇన్‌చీఫ్, 15 రోజులకు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు