News August 18, 2025
NZB: సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు నివేదికలు సమర్పించాలి

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News August 18, 2025
SRSP UPDATE: 1 వరద గేట్ మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో సోమవారం 39 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి ఇన్ ఫ్లో కొంచెం తగ్గడంతో ఒక వరద గేటును మూసి 38 గేట్ల ద్వారా 1,32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందిరమ్మ కాల్వకు 18 వేలు, కాకతీయ కాల్వకు 4,700 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1,17,148 క్యూసెక్కుల నీరు వస్తోందని SRSP అధికారులు చెప్పారు.
News August 18, 2025
NZB: రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.
News August 18, 2025
NZB: యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి

వ్యవసాయ అవసరాల కోసం కేటాయిస్తున్న యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు స్పష్టం చేశారు. సోమవారం వారు రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, సంచాలకులు గోపితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.