News August 18, 2025
లిక్కర్ స్కాం కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సహా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లనూ కొట్టేసింది.
Similar News
News August 18, 2025
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం కారణంగా రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏపీలోని మన్యం, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లి మండలాలకూ సెలవు ఇచ్చారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
News August 18, 2025
జియో యూజర్లకు షాక్

రిలయన్స్ జియో రెండు బేసిక్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌లను రద్దు చేసింది. రూ.209(22 డేస్, డైలీ 1GB), రూ.249(28 డేస్, డైలీ 1GB) ప్లాన్‌లను తీసేసింది. దీంతో వినియోగదారులు రూ.299(1.5GB, 28D) ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అటు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బేస్ ప్లాన్స్ కూడా రూ.299(డైలీ 1GB)గా ఉన్నాయి. మరోవైపు వచ్చే 6 నెలల్లో రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికం నిపుణులు చెబుతున్నారు.
News August 18, 2025
రేపు మధ్యాహ్నం 1.30కి భారత జట్టు ప్రకటన

దుబాయ్ వేదికగా వచ్చే నెల 9న ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీకి BCCI రేపు భారత జట్టును ప్రకటించనుంది. ముంబైలో మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమై 1.30కి టీమ్‌ను అనౌన్స్ చేయనుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా లేక నేరుగా ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో ఎవరిని ఎంపిక చేస్తుంది? ఎవరికి ఉద్వాసన పలుకుతుంది? అన్న ఉత్కంఠ నెలకొంది. ఉమెన్స్ వరల్డ్ కప్‌కు సైతం బోర్డు జట్టును ప్రకటించనుంది.