News August 18, 2025

HYD: మీ పేరుపై ఎన్ని సిమ్ములు ఉన్నాయో.? ఇలా తెలుసుకోండి.!

image

మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి.? ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారేమో.? అని ఆందోళన చెందుతున్నారా..? దయచేసి సంచార్ సాథీ పోర్టల్ www.sancharsaathi.gov.inలో మీ పేరు మీద జారీ చేయబడిన SIMS తనిఖీ చేసుకోవాలని సమాచార కేంద్ర శాఖ ప్రజలందరికీ పంపుతున్నట్లు HYD పోలీసు అధికారులు తెలిపారు. మీ సిమ్ వేరే వ్యక్తులు ఉపయోగిస్తే, అది మీపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News August 18, 2025

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం కారణంగా రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏపీలోని మన్యం, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లి మండలాలకూ సెలవు ఇచ్చారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

News August 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార
➤ భారీ వర్షాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
➤ ఎడతెరిపి లేని వానలకు జిల్లాలో పలు చోట్ల నీట మునిగిన పంటలు
➤ శ్రీకాకుళం: కేజీబీవీ ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం
➤రైతుల సమస్యలు పట్టవా: తిలక్
➤పలాసలో జలమయమైన రోడ్లు
➤ అధ్వానంగా కె కొత్తూరు సర్వీస్ రోడ్డు
➤మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్
➤ సంతబొమ్మాళి: వర్షాలతో నౌపాడ ఉప్పునకు ముప్పు

News August 18, 2025

ASF: సమ్మె బాట పట్టనున్న భగీరథ సిబ్బంది

image

తమ సమస్యలను పరిష్కరించకపోతే మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని మిషన్ భగీరథ ఆపరేటర్, హెల్పర్, సూపర్వైజర్ జేఏసీ నాయకులు తెలిపారు. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని, తమ సమస్యలను ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె నిర్వహించనున్నట్లు ఎల్‌&టి పీఎంకు నోటీసు కూడా ఇచ్చినట్లు వారు చెప్పారు.