News August 18, 2025
సిద్దిపేట: 32 మందికి జరిమానా.. ఒకరికి జైలు శిక్ష

సిద్దిపేటలోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుపడ్డ 32 మందికి రూ.59,500 జరిమానా, ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష పడిందని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ ఈరోజు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని, బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశామన్నారు. మద్యం తాగినట్లు రిపోర్టు రాగా స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ కాంతారావు ముందు హాజరుపర్చగా తీర్పు వెల్లడించారు.
Similar News
News August 18, 2025
ASF: సమ్మె బాట పట్టనున్న భగీరథ సిబ్బంది

తమ సమస్యలను పరిష్కరించకపోతే మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని మిషన్ భగీరథ ఆపరేటర్, హెల్పర్, సూపర్వైజర్ జేఏసీ నాయకులు తెలిపారు. గత ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని, తమ సమస్యలను ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి నుంచి కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె నిర్వహించనున్నట్లు ఎల్&టి పీఎంకు నోటీసు కూడా ఇచ్చినట్లు వారు చెప్పారు.
News August 18, 2025
ఐదేళ్ల MSC కోర్సులో ప్రవేశానికి వైవీయూ దరఖాస్తులు

యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో MSC ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 8985597928, 9985442196 నంబర్లను సంప్రదించాలన్నారు.
News August 18, 2025
సంగారెడ్డి: పోలీస్ ప్రజావాణికి 12 దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ పరితోష్ పంకజ్ వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 12 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఫోన్‌లో ఎస్పీ ఆదేశించారు.