News August 18, 2025
మాల్కాజ్‌గిరి: గణేశ్ ఉత్సవాలకు భారీ బందోబస్తు: సీపీ

రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గణేశ్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలు, నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్సవ నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ, నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 19, 2025
ఏపీ ముచ్చట్లు

* ఇవాళ శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 28న గరుడసేవ.
* సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న అంగన్వాడీల నిరసన
* రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(SBTET)కు NCVET గుర్తింపు. ఇకపై సాంకేతిక విద్య పరిధిలోని కోర్సులు చేసిన విద్యార్థులకు డ్యుయల్ సర్టిఫికెట్.
News August 19, 2025
ఉమ్మడి కడప: నవోదయ ప్రవేశాల డేట్స్ పొడిగింపు

ఉమ్మడి కడప జిల్లాలో నవోదయ ప్రవేశానికి ఈనెల 27 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట మండలం నారంరాజుపల్లె జవహర్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధరన్ మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అన్నమయ్య, కడప జిల్లాల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News August 19, 2025
ఈ నెల 22న తెలంగాణ బంద్

TG: మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వారు ఇక్కడికి వలస వచ్చి కులవృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడింది. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.