News August 18, 2025
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయండి : Dy CM భట్టి

మధిర పట్టణ సమగ్ర అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా ఒకసారి మున్సిపల్ ఇంజినీర్ ఇన్‌చీఫ్, 15 రోజులకు చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు
Similar News
News August 19, 2025
15 రోజులకు 2 సార్లు చల్లితే మంచి ఫలితాలు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ప్రస్తుతం 2,700 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, రైతులు ప్రస్తుత అవసరానికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఎకరానికి ఒకేసారి కాకుండా 15 రోజులకు 2 సార్లు చల్లితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
News August 19, 2025
ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్ అనుదీప్

జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని, గత సంవత్సరం కంటే నేటికి 3250 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా రైతులకు సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత, సరఫరాపై సంబంధిత జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు.
News August 19, 2025
ఆకేరు, మున్నేరు వరద పరిస్థితిపై పర్యవేక్షణ: కలెక్టర్

గత సంవత్సర అనూహ్య వరదలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు, పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆకేరు, మున్నేరు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సర అనూహ్య వరదల దృష్ట్యా ముందస్తుగానే వరద పరిస్థితి తెలుసుకొని, సహాయక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.