News April 1, 2024

ADB: ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాకు రాహుల్ గాంధీ: సీతక్క

image

ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గాంధీని చంపిన గాడ్సేకు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే దండగ.. బీజేపీకి ఓట్లు వేస్తే అభివృద్ధి రాదన్నారు. ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని తెలిపారు.

Similar News

News January 15, 2025

కౌటాల: కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

image

కౌటాల మండలం జనగామ గ్రామ పల్లె ప్రకృతి వనం సమీపంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్పీ దేవి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు సీఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు ఎస్ఐ మధుకర్ తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకొని, 3 కోడిపుంజులు, నగదు రూ.3900, 3 కోడి కత్తులు స్వాధీన చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 15, 2025

నిర్మల్‌: జనవరి 22 వరకు అర్హులను ఎంపిక చేయాలి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈనెల 22 వరకు పంచాయతీలలో గ్రామ సభలను, పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేయాలని అధికారులకు వీసీలో ఆదేశించారు.

News January 14, 2025

BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి

image

సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.