News August 18, 2025
దుంపగడప: వీవీ గిరి కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
Similar News
News August 18, 2025
భీమవరం: ‘అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై సమీక్ష’

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనతో బలోపేతానికి ఐసీడీఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 489 అంగన్వాడీలకు ఒక్కొక్క అంగన్వాడికి రూ.16 వేలు చొప్పున కేటాయించిన నిధులతో గుర్తించిన పనులను పూర్తి చేయాలన్నారు.
News August 18, 2025
దుంపగడప: వీవీ గిరి కళాశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన

ఆకివీడుమండలం దుంపగడప వీవీ గిరి ప్రభుత్వ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ, కలెక్టర్ నాగరాణీలు శంకుస్థాపన చేసారు. భారత జీవిత భీమా సంస్థ సామాజిక బాధ్యత విభాగం గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ వీవీ.గిరి ప్రభుత్వ కళాశాలకు ఎక్స్టెన్షన్ బ్లాక్ నిర్మాణానికి రూ. 1.06 కోట్లు నిధులు ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
News August 18, 2025
ప.గో: భారీ వర్షాలు.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. అత్యవసర సహాయం కోసం 08816 299181 నంబర్‌తో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారుల సెలవులు రద్దు చేస్తూ, గజ ఈతగాళ్లను, మోటార్ బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు సముద్రం, గోదావరి నది వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.