News August 18, 2025
KNR: కోటగిరి గట్ల వైభవం.. నేటికీ సజీవం!

KNR జిల్లా సైదాపూర్ మం. సర్వాయిపేట కోటగిరి గట్లలోని చారిత్రక కట్టడాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. కొత్త, పాత ఖిల్లాలు, బలిష్టమైన రాతిగోడలు, రహస్య సొరంగాలు, బయ్యన్న విగ్రహం, చెరువులు, ఆలయాలు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను చాటుతున్నాయి. కోనేర్లు, కందకాలు, హనుమాన్, శివాలయాలు, ఎల్లమ్మగుడి నిర్మాణాలు ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పాపన్న నిర్మించిన బయ్యన్న, సర్వమ్మ, ఎల్లమ్మ చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.
Similar News
News August 19, 2025
పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలి: కరీంనగర్ కలెక్టర్

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహాల్లో పెరుగుతున్న 3 ఏళ్ల పాపను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా USAకు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు. వీరికి ఇది వరకే బాబు జన్మించగా ఆడశిశువు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం విచారించి ఆడ శిశువును కలెక్టర్ సోమవారం దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News August 19, 2025
ప్రజలను అప్రమత్తం చేయాలి: ఎస్పీ

వర్షాల వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదుల వద్ద పోలీస్ అధికారులు బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
News August 19, 2025
భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వరకు 310.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారిగా పలిమెల 64.3 మి.మీ, మహముత్తారం 27.0 మి.మీ, మహాదేవపూర్ 17.4, మి.మీ, కాటారం 21.2 మి.మీ, మల్హర్ 21.0 మి.మీ, కొత్తపల్లి గోరి 17.5,చిట్యాల 19.5 మి.మీ, టేకుమట్ల 16.0 మి.మీ, మొగుళ్లపల్లి 15.0 మి.మీ, రేగొండ 14.0 మి.మీ, గణపురం 26.3 మి.మీ, భూపాలపల్లి 51.3 మి.మీ లుగా నమోదైంది.