News August 18, 2025
నేషనల్ అవార్డ్స్ విజేతలకు సీఎం సన్మానం

TG: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా HYDను నిలపాలని CM రేవంత్ అన్నారు. సినిమా రంగానికి అవసరమైన చేయూతనందిస్తామని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన సినీ ప్రముఖులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను CM దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దర్శకులు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్ తదితరులను CM సన్మానించారు.
Similar News
News August 18, 2025
బందీల విడుదలకు అంగీకరించిన హమాస్!

ఇజ్రాయెల్‌తో 60 రోజుల సీజ్‌ఫైర్‌కు పాలస్తీనా టెర్రర్ గ్రూప్ హమాస్ అంగీకరించిందని Reuters తెలిపింది. ఈ మేరకు మిగిలిన బందీలను విడుదల చేయనుందని పేర్కొంది. అదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ క్రమంగా తమ బలగాలను వెనక్కి తీసుకోనుందని చెప్పింది. అయితే బందీలందరినీ వదిలేసి ఆయుధాలను పక్కనపెడితేనే యుద్ధం ఆపుతామని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సీజ్‌ఫైర్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో చూడాలి.
News August 18, 2025
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం కారణంగా రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏపీలోని మన్యం, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లి మండలాలకూ సెలవు ఇచ్చారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
News August 18, 2025
జియో యూజర్లకు షాక్

రిలయన్స్ జియో రెండు బేసిక్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌లను రద్దు చేసింది. రూ.209(22 డేస్, డైలీ 1GB), రూ.249(28 డేస్, డైలీ 1GB) ప్లాన్‌లను తీసేసింది. దీంతో వినియోగదారులు రూ.299(1.5GB, 28D) ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అటు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బేస్ ప్లాన్స్ కూడా రూ.299(డైలీ 1GB)గా ఉన్నాయి. మరోవైపు వచ్చే 6 నెలల్లో రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికం నిపుణులు చెబుతున్నారు.