News August 18, 2025
NZB: రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచనున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా అనునిత్యం పర్యవేక్షించాలన్నారు.
Similar News
News August 19, 2025
NZB: టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై బదిలీ వేటు

NZB పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌ను పూర్తి స్థాయి ప్రక్షాళన చేశారు. ఒకే రోజులో ఏకంగా 14 మందిపై బదిలీ వేటు వేశారు. CI అంజయ్యను CCRBకి, SI గోవింద్ ఆర్మూర్, శివరాం CCRBకి అటాచ్ చేశారు. సిబ్బంది యాకుబ్ రెడ్డి, లస్మన్న, సుధీర్, అనిల్ కుమార్, రాజు, సచిన్, అన్వర్, అనిల్, శ్రీనివాస్, ఎన్.సచిన్, సాయినాథ్‌ను వివిధ పోలీస్ స్టేషన్లు, ARకు అటాచ్ చేశారు.
News August 19, 2025
NZB: 967 చెరువులు.. 4.5 కోట్ల చేప పిల్లలు

మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ధేశించిన లక్ష్యం మేరకు చేప పిల్లల పిల్లల పెంపకానికి చొరవ చూపాలన్నారు.
News August 18, 2025
SRSP UPDATE: 1 వరద గేట్ మూసివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో సోమవారం 39 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాత్రి ఇన్ ఫ్లో కొంచెం తగ్గడంతో ఒక వరద గేటును మూసి 38 గేట్ల ద్వారా 1,32,390 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందిరమ్మ కాల్వకు 18 వేలు, కాకతీయ కాల్వకు 4,700 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 1,17,148 క్యూసెక్కుల నీరు వస్తోందని SRSP అధికారులు చెప్పారు.