News August 18, 2025

యాచకురాలిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్: ADB CI

image

ADB శివాజీ చౌక్ సమీపంలో ఈనెల 8న యాచకురాలిపై అత్యాచారానికి, దోపిడీకి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా పది రోజుల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడు గుడిహత్నూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాడవి నగేష్‌ను సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నామన్నారు. తాగిన మైకంలో, కామంతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News August 19, 2025

ADB ఎస్పీకి విద్యార్థిని స్పెషల్ గిఫ్ట్

image

యువత అన్ని రంగాల్లో రాణించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌కు చెందిన బద్దం మేఘనారెడ్డి పెన్సిల్ చార్కోల్ ఆర్ట్ ద్వారా ఎస్పీ చిత్రాన్ని అద్భుతంగా గీశారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని స్థానిక డీపీఓ కార్యాలయంలో కలిసి చిత్రాన్ని ఆమె బహూకరించారు. చిత్రాన్ని చూసి విద్యార్థిని ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

News August 18, 2025

రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

image

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.

News August 18, 2025

ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.