News August 18, 2025
జియో యూజర్లకు షాక్

రిలయన్స్ జియో రెండు బేసిక్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌లను రద్దు చేసింది. రూ.209(22 డేస్, డైలీ 1GB), రూ.249(28 డేస్, డైలీ 1GB) ప్లాన్‌లను తీసేసింది. దీంతో వినియోగదారులు రూ.299(1.5GB, 28D) ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అటు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బేస్ ప్లాన్స్ కూడా రూ.299(డైలీ 1GB)గా ఉన్నాయి. మరోవైపు వచ్చే 6 నెలల్లో రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికం నిపుణులు చెబుతున్నారు.
Similar News
News August 19, 2025
దీపావళికి కార్లు, బైక్‌ల ధరల తగ్గింపు?

దీపావళికి కొత్త కార్లు, బైక్‌లు కొనే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. కొత్త తరం GST సంస్కరణలను అమలు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్‌లను రెండుకు తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 28 శాతం పన్ను స్లాబ్‌లో ఉన్న కార్లు, బైక్‌లు 18 శాతం పన్ను స్లాబ్‌లోకి వస్తాయని సమాచారం. తక్కువ ధరలు ఉన్న వాహనాల సేల్స్ పెరగొచ్చని అంచనా.
News August 19, 2025
50 ఏళ్లనాటి రూల్స్‌తో సినిమాలు తీయలేం: SKN

సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదని ప్రొడ్యూసర్ SKN తెలిపారు. 50 ఏళ్ల నాటి రూల్స్‌తో ఇప్పుడు సినిమాలు నిర్మించడం కష్టమని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘కార్మికులు రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువగా వేతనాలు తీసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లో చెల్లిస్తున్న వేతనాల కంటే ఇది చాలా ఎక్కువ. కార్మికులు ఇలాగే నిబంధనలు విధిస్తే ఇతర భాషల మేకర్స్ ఇక్కడికి రాలేరు’ అని పేర్కొన్నారు.
News August 19, 2025
భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

ఆరు నెలల్లోనే తాను 6 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇందులో భారత్-పాక్ యుద్ధం కూడా ఉన్నట్లు ఆయన మరోసారి చెప్పారు. జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను కానీ ఖచ్చితంగా ముగుస్తుంది. 31 ఏళ్లుగా జరుగుతున్న రువాండా-కాంగో యుద్ధాన్ని ఆపా. అలాగే ఈ యుద్ధాన్ని కూడా నిలువరిస్తా’ అని చెప్పుకొచ్చారు.