News August 18, 2025

పార్వతీపురం జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

image

పార్వతీపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. >Share it

Similar News

News August 19, 2025

జనగామలో 1273 మెట్రిక్ టన్నుల యూరియా

image

జిల్లా వ్యాప్తంగా 1273.935 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట 10.516, చిల్పూర్ 82.29, దేవరుప్పుల 181.335, ఘన్‌పూర్ స్టేషన్ 172.545, జనగామ 155.32, కొడకండ్ల 56.745, లింగాల ఘన్‌పూర్ 99.375, నర్మెట్ట 74.295, పాలకుర్తి 80.405, రఘునాథ్‌పల్లి 192.457, తరిగొప్పుల 21.51, జఫర్‌గఢ్ 69.93 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.

News August 19, 2025

50 ఏళ్లనాటి రూల్స్‌తో సినిమాలు తీయలేం: SKN

image

సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు చిన్న నిర్మాతలు అంగీకరించడం లేదని ప్రొడ్యూసర్ SKN తెలిపారు. 50 ఏళ్ల నాటి రూల్స్‌తో ఇప్పుడు సినిమాలు నిర్మించడం కష్టమని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘కార్మికులు రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువగా వేతనాలు తీసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లో చెల్లిస్తున్న వేతనాల కంటే ఇది చాలా ఎక్కువ. కార్మికులు ఇలాగే నిబంధనలు విధిస్తే ఇతర భాషల మేకర్స్ ఇక్కడికి రాలేరు’ అని పేర్కొన్నారు.

News August 19, 2025

భారత్-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్

image

ఆరు నెలల్లోనే తాను 6 యుద్ధాలు ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇందులో భారత్-పాక్ యుద్ధం కూడా ఉన్నట్లు ఆయన మరోసారి చెప్పారు. జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా ఆయన వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేను కానీ ఖచ్చితంగా ముగుస్తుంది. 31 ఏళ్లుగా జరుగుతున్న రువాండా-కాంగో యుద్ధాన్ని ఆపా. అలాగే ఈ యుద్ధాన్ని కూడా నిలువరిస్తా’ అని చెప్పుకొచ్చారు.